ఆర్మూర్, మే 26 : బెంగళూరు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ .. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో గురువారం భేటీ అయ్యారు.
సీఎం కేసీఆర్ వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవెగౌడను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరిచయం చేసుకున్నారు.