కోటగిరి : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి అశోక్ (DEO Ashok ) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్ష (Tenth Exams ) కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష రాసే విధానం పై పలు సూచనలు చేశారు. అనంతరం కోటగిరి లో కొనసాగుతున్న ఎఫ్ఎల్ఎన్ కేంద్రాన్ని, మండల విద్య వనరుల కేంద్రాన్ని , కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. ఆయన వెంట కోటగిరి ఇన్చార్జి ఎంఈవో నాందేడ్ల శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు.