Kotagiri | కోటగిరి : అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతీ నెలా మొదటివారంలో పిల్లల బరువు, ఎత్తును ఆన్లైన్లో నమోదు చేయాలని బోధన్ సీడీపీవో నందిని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని బీసీ కాలనీ, మాలివాడ అంగన్వాడీ కేంద్రాలను ఆమె సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల రిజిస్టర్లను పరిశీలించారు.
పిల్లలకు గర్భిణులకు అందించే పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు. చిన్నారులు, గర్భిణీ బాలింతలకు ప్రతీ రోజు మెనూ ప్రకారం పౌష్టికాహారం పెట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే మండలంలోని ఏక్లాస్ పూర్ క్యాంప్ సమీపంలో గల గుమ్మడి ఫౌండేషన్ ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు. ఆశ్రమంలోని వంటగది, ఆహారం, పిల్లల రిజిస్టర్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కోటగిరి సెక్టార్ సూపర్ వైజర్ కొమురవ్వ, గుమ్మడి ఫౌండేషన్ మేనేజర్ బాల ప్రసాద్, మాధురి, అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, సాయమ్మ పాల్గొన్నారు.