మాక్లూరు : నిజామాబాదు ( Nizamabad) జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన నరేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య, పిల్లలు ఒంటిరి కావడంతో వారిని ఆదుకునేందుకు నిర్ణయించిన నరేష్ చిన్ననాటి స్నేహితులు(Friends) ఆర్థికంగా సహాయం (Financial assistance) చేసేందుకు ముందుకు వచ్చారు.
నిజామాబాదు జిల్లాలోని మాణిక్ భవన్ పాఠశాలలో పదవ తరగతి చదివిన 2003-04 బ్యాచ్‌కు చెందిన తోటి స్నేహితులు శనివారం రూ. 4లక్షలు సేకరించి ఆర్థిక సహాయాన్ని నరేష్ కుటుంబానికి శనివారం అందజేసి ఆదుకున్నారు. భవిష్యత్‌లో కూడా అండగా ఉంటామని వారు భరోసాను కల్పించడంతో బాధితుడి కుటుంబానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది.