బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 9 : ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా అంతుచిక్కని వైరస్‌తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే లక్షల కోళ్లు మృతిచెందగా.. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం, బోర్లం క్యాంపులో ఓ పౌల్టీఫాంలో ఆదివారం దాదాపు రెండు వేల బాయిలర్ కోళ్లు మృతి చెందాయి.
ఇటీవల మండలంలోని తిర్మలాపూర్‌లో రెండువేలు, బీర్కూర్ మండలంలోని చించోలి, కిష్టాపూర్‌లో మూడు వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన కోళ్లను గ్రామ శివారులో జేసీబీల సాయంతో గుంతలు తవ్వించి అందులో పూడ్చి పెట్టారు. అంతుచిక్కని వైరస్ సోకి కోళ్లు మృత్యువాత పడుతుండడంతో పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.