నస్రుల్లాబాద్ : నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ రామాలయం మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా బస్టాండ్ ఆవరణకు చేరుకొని, ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.