మాచారెడ్డి, మార్చి 21 : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండా క్రాస్ రోడ్డులో మహమ్మద్ ఖాసింఖాన్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం మాచారెడ్డి ఎస్ఐ అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా చలివేంద్రం ద్వారా ప్రజల దాహార్తి తీరుస్తున్న నిర్వాహకులను ఎస్ఐ అభినందించారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అలీఖాన్, రఫ్ ఖాన్, బాబాఖాన్, మహబూబ్ ఖాన్, ఆశ్రాఫ్ ఖాన్, ఖలీల్, అబ్దుల్లా, అభిషేక్, వంశీ పాల్గొన్నారు.