పొతంగల్ అక్టోబర్ 14: తాజా ఆకుకూరలు, పండ్లలో అనేక పోషక విలువలు ఉంటాయని సిడిపిఓ పద్మ అన్నారు. నిజామాబాద్ జిల్ల౩ఆ పొతంగల్ మండలంలోని సాయిబాబ ఫంక్షన్ హాల్లో గురువారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..స్థానికంగా లభించే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా మహిళలలో రక్తహీనత రాకుండా బలమైన పోషకాహారాన్ని, ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణిలకు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారం తీసుకావాలని సూచించారు.
మహిళలు పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నిత్యం యోగ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని యోగ ప్రాముఖ్యతపై జ్యోతి వివరించారు. ఈ సందర్భంగా గర్భిణిలకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చందర్, హెల్త్ సూపర్వైజర్లు సుజాత, సావిత్రి, సునీత, పోషణ కొ అర్డి నేటర్ నరేష్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు కొమరవ్వ, శ్రీలత, వెంకటరమణ, అంగన్వాడీ టీచర్లు, కల్పన, బాల లక్ష్మి, సుజాత, స్వరూప, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.