CC road work | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 10: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నుండి డబుల్ బెడ్ రూమ్ కాలనీ వరకు సీసీ రోడ్డు పనులను మాజీ ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేష్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా రూ.8 లక్షలు మంజూరయ్యాయన్నారు. దీని లో భాగంగా ఈ సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిలు వెంకటేశ్వరరావు, అల్లం గంగారం, గోపి నాయక్, చుంచు వెంకన్న, చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.