సారంగాపూర్/ఎడపల్లి/నవీపేట, నవంబర్ 1: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కులగణన సర్వే కోసం మండలంలోని గుండారం కుటుంబాలను గుర్తించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ గుండారం గ్రామాన్ని సందర్శించి కుటుంబాలను గుర్తించే ప్రక్రియను పర్యవేక్షించారు. ఒక్కో ఎన్యుమరేటర్ 175 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపా రు.
ప్రొఫార్మలో పొందుపర్చిన అంశాల వివరాల్లో తప్పులు దొర్లకుండా పక్కాగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయి అధికారులు సర్వే ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆయనవెంట తహసీల్దార్ అనిరుధ్, ఎంపీవో ఎక్బాల్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి ఉన్నారు. కేశాపూర్‌లో చేపట్టిన కార్యక్రమాన్ని నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ పరిశీలించారు.
ఎడపల్లి మండల కేంద్రంతోపాటు జాన్కంపేట్ గ్రామంలో కుటుంబ సర్వేను అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు.
ఆయన వెంట ఎంపీడీవో శంకర్, ఎంపీవో మన్మోహన్ శర్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నాగరాజు గౌడ్, ప్రేమ్ దాస్, సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి, నాయకుడు బంజ కామప్ప పాల్గొన్నారు. ఈనెల 6 నుంచి చేపట్టనున్న కుల గణన సర్వేను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. నవీపేట మండలంలోని అబ్బాపూర్(ఎం)లో సర్వే చేపట్టన్ను ఇండ్లను ఆయన తనిఖీ చేసి మండల స్థాయి అధికారులకు పలు సూచనాలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో నాగనాథ్, ఎంపీవో రామకృష్ణ తదితరులు ఉన్నారు.
చందూర్, నవంబర్ 1: సమగ్ర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. శుక్రవారం చందూ ర్ మండల కేంద్రంలో ఆయన సందర్శించా రు. సమగ్ర సర్వేపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికీ సంబంధించిన సామాజి క, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల వివరాల సేకరణ కోసం ఈనెల 6వ తేదీ నుంచి సమగ్ర సర్వేను చేపట్టనున్నట్లు తెలిపారు. సర్వే పకడ్బందీగా ఉండాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శాంత, ఎంపీడీవో నీలావతి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మోర్తాడ్, అక్టోబర్ 1: కమ్మర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన కుల గణన సర్వేను అధికారులు పరిశీలించారు. మండలంలోని చౌట్పల్లి, నర్సాపూర్, ఉప్లూర్, కోనాసముందర్, అమీర్‌నగర్ గ్రామాల్లో కుల సర్వేను పరిశీలించారు. ఎన్యుమరేటర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రాజశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రెంజల్, నవంబర్ 1: కుటుంబ సర్వేను తప్పులు దొర్లకుండా చేపట్టాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి వాజేద్హుస్సేన్ సూచించారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకటేశ్జాదవ్, తహసీల్దార్ శ్రావణ్, మండల పర్యవేక్షకుడు శ్రీనివాస్ గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఆర్మూర్‌టౌన్, నవంబర్1: ఆర్మూర్ పట్టణంలోని 36వ వార్డులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఆయన వంఎట కౌన్సిలర్ రమేశ్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.