ఖలీల్ వాడి జనవరి : బడుగు, బలహీన వర్గాల విద్యకు విశేష కృషి చేసిన మహాత్మ జ్యోతిబా పూలే దంపతులు, రాజ్యాంగ రచన ద్వారా బహుజన సమాజం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా, బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలను అనుసరించి బహుజన విద్యార్థి ఫోర్స్ ఆవిర్భవించిందని బీవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సిరివెసు సంతోష్ తెలిపారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో బీవీఎఫ్ విద్యార్థి సంఘం జెండా, ఎజెండాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా చేస్తున్న ఫీజుల దోపిడీని నియంత్రించడం, ప్రతి పేద విద్యార్ధి కి ఉన్నత విద్యను చేరువ చేయడమే లక్ష్యం గా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో బహుజన నేతలు నీరడి రవి, గంధం రాజేష్, దాడి రమేష్, మహేష్, రాకేష్, విద్వాన్ష్, రవళి, మానస, కృతి, హాసిని తదితరులు పాల్గొన్నారు.