కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో ఉన్న స్మశాన వాటిక ( Crematorium ) ను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ( Subhash Reddy ) ని గురువారం ఆర్య వైశ్యులు ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ఆర్యవైశ్యులు ఆయన ఇంటికి వెళ్లి బొకే అందజేసి శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్ గుప్తా, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, కామారెడ్డి పట్టణ ఆర్య వైశ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిత బాలాజీ, కామారెడ్డి పట్టణ ఆర్య వైశ్య మాజీ అధ్యక్షులు కొండ బైరయ్య , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లక్ష్మి రాజాం, శ్రీనివాస్, శెనిశెట్టి శ్రీనివాస్, మంచి రవి తదితరులు పాల్గొన్నారు.