దోమలపెంట, జూన్ 26 : అదుపు తప్పి బస్సు బోల్తాపడిన ఘటన గురువారం శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి మార్గ మధ్యలో దోమలపెంట గ్రామం వద్ద గురువారం ఉద యం చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం జనగాం కు చెందిన నాగరాజు తన కు టుంబ సభ్యులతో కలిసి శ్రీశైల మల్లికార్జున స్వామికి మొక్కు చెల్లించేందుకు 36 మందితో జనగాంకు చెందిన టీఎస్08 హెచ్ఎ 2329 నెంబర్ గల బస్సులో బయలుదేరాడు. బస్సు దోమలపెంట ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్దకు రాగానే బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి ఆవును, కారుని ఢీకొట్టి గోడకు తగిలి బోల్తా ప డింది.
వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, గ్రామస్తులు చేరుకొని బోల్తాపడి న బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను రక్షించారు. అందులో 29మంది పెద్ద లు, 7మంది పిల్లలు, 8నెలల బాబు ఉన్నారు. వీరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, బస్సు బ్రేక్ ఫెయిల్ అయిన తర్వాత డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహరించడంతో స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.