కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధి ఇల్చిపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు ( RTC Bus ) యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో లారీ ఢీ కొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను పోలీసులు( Police) చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.