కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
నిజామాబాద్ నగరంలోని కానిస్టేబుల్ ఇంటికి తాళం ఉండడంతో టార్గెట్ చేసిన దొంగలు.. అర్ధరాత్రి అనంతరం ఆ ఇంటికి కన్నం వేసి బంగారు, వెండినగలతో పాటు నగదును దోచుకుపోయారు.
- 16 తులాల బంగారు నగలు, రూ. 30 వేల నగదు మాయం
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 31 : నిజామాబాద్ నగరంలోని కానిస్టేబుల్ ఇంటికి తాళం ఉండడంతో టార్గెట్ చేసిన దొంగలు.. అర్ధరాత్రి అనంతరం ఆ ఇంటికి కన్నం వేసి బంగారు, వెండినగలతో పాటు నగదును దోచుకుపోయారు. రూరల్ ఎస్సై జి. లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ గంగాధర్ తన తమ్ముడు, కుటుంబసభ్యులు నాలుగు రోజుల క్రితం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మారుతినగర్లో ఉన్న ఇంటికి తాళం వేసి షాపింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో దుంగడులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశారు. ఇంట్లో ఉన్న సుమారు 16 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి పట్టగొలుసులు, రూ.30 వేలు నగదును దోచుకుపోయారు. అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత కానిస్టేబుల్ కుటుంబసభ్యులు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం ఏసీపీ ఎ.వెంకటేశ్వర్, సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై జి.లింబాద్రి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

