Nizamabad | సిరికొండ, జూలై 14 : బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ రూరల్ ఇన్చార్జ్ మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని మెట్టు మర్రితండా, గడ్డమీద తండా, కొండాపూర్, తుంపల్లి, రావుట్ల చిన్నవాల్గొట్, పెద్ద వాల్గోట్ గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు.
ఇటీవల మృతిచెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరవోయిన శ్రీనివాస్, నాయకులు తోట రాజన్న, రమేష్, సుమన్, భూషణ్ రెడ్డి, రాజన్న, తిరుమల్, మహేందర్ గంగారెడ్డి, లష్కర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.