మద్నూర్/ నిజాంసాగర్, ఏప్రిల్ 15: వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పిలుపునిచ్చారు. మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంతోపాటు మహ్మద్‌నగర్ మండలకేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యరకర్తల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
గులాబీ జెండా ప్రజలకు అండ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం అందరూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బాగుండునని అనుకుంటున్నారని తెలిపారు. గ్రామగ్రామాన బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
మద్నూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బన్సీపటేల్, నాయకులు దరాస్ సురేశ్, విజయ్‌కుమార్, గఫర్, నిజామొద్దీన్, గోవింద్, సంజయ్, రాజుపటేల్, హన్మాండ్లు, రాజు, తులసీరాం, సుధీర్, శ్రీనివాస్, హన్మంత్‌రావు, అశోక్, మహ్మద్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ ఉమ్మడి మండలాల అధ్యక్షుడు సాదుల సత్యనారాయణ, పార్టీ అన్నిగ్రామాల శాఖ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.