
Gampa Govardhan | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై బీఆర్ఎస్ తలపెట్టిన భారీ నిరసన ర్యాలీ విజయవంతమైంది. మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో సుమారుగా రెండు వేల మంది విద్యార్థులతో డిగ్రీ కళాశాల మైదానం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు.
రేవంతాసుర పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులకు విద్య అందడం లేదని గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాంసాగర్ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు చేతిలో భారీ గులాబీ జెండాను పట్టుకొని గులాబీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ముజీబుద్దిన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంప శశాంక్, మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.