బాన్సువాడ, జూన్ 28 :బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ఈ నెల 28న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, జాజాల సురేందర్, సభ్యత్వ నమోదు బాన్సువాడ నియోజక వర్గ ఇన్చార్జి తోట ఆగయ్య హాజరవుతారని పేర్కొన్నారు.