బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ నేతలు బుధవారం ఘనంగా నిర్వహించారు. డిచ్పల్లి మానవతా సదన్‌లో ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మద్నూర్ మండలం మేనూర్‌లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే కేక్ కట్ చేశారు.
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా హైదరాబాద్‌లో కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.