పోతంగల్ ఏప్రిల్ 27: నిజమాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు చలో వరంగల్ బహిరంగ సభకు ఆదివారం ఉదయం బయలుదేరారు. ముందుగా వివిధ గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి బయలుదేరారు. కేసీఆర్ నేతృత్వంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ సమావేశానికి మండలంలోని కేసీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పోతంగల్ మండల నాయకులు సుధాం నవీన్, అరిఫ్ బేగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వరంగల్‌కు తరలి వెళ్లారు.
మళ్లీ సారే రావాలి అంటూ నినాదాలు చేశారు. కాగా, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక కంట్రోల్ కమాండ్ సెంటర్లో హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే 9014206465 నంబర్‌కు ఫోన్ చేయాలని పార్టీ బాధ్యులు సూచించారు.