Kammarpally | మోర్తాడ్ : కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో యూరియా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాస్తారోకో చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామ కమిటీ సభ్యులను కాకుండా బీఆర్ఎస్ నాయకులు 8 మందిని ఉదయం నాలుగు గంటలకు అరెస్టు చేసి బాల్కొండలోని ముప్కాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారిని కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు.
గ్రామ కమిటీ నిర్ణయం తీసుకోగా తమల్నీ ఎందుకు అరెస్టు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఎస్ఐ సతీష్ ప్రశ్నించారు. కాగా ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ముందస్తు అరెస్టు చేసినట్లు చెప్పారు. కాగా పోలీసుల తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు పోలీసుస్టేషన్లో బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, తమను అరెస్టు చేస్తూ రాక్షసానందం పొందుతోందని విమర్శించారు.