ఆర్మూర్ టౌన్: కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఆర్మూర్ (Armur) పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ విమర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆర్మూర్ కెనాల్ బ్రిడ్జ్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారు గంట సేపు రాస్త రోకో చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రంలో పార్టీ సీనియర్ నాయకులు సుంకరి రవి, పోలా సుధాకర్, నచ్చు చిన్న రెడ్డి, జిజి రామ్, సత్యం, అగ్గు క్రాంతి, గుంజల పృద్వి, హాజీమ్, లతీఫ్, హర్షద్, మహమ్మద్ శైఫ్, రహ్మద్, ఇంద్రపు, రాజు, నడుకూడ నాగరాజు, సాంబాడి ఆనంద్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.