బోధన్, నవంబర్ 15: సీఎం కేసీఆర్ ఆశీర్వదంతో బోధన్ నియోజకవర్గాన్ని తొమ్మినరేండ్లలోనే రూ.3వేల 500 కోట్లతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ తెలిపారు. పట్టణ శివారులోని అంబెం గేట్ వద్ద బుధవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు రూ. 2వేల కోట్లు జమయ్యాయని తెలిపారు. దీంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే సాధ్యమయ్యిందని తెలిపారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని షకీల్ కోరారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. బోధన్ నియోజకవర్గానికి జేఎన్టీయూ కళాశాల, బీఫార్మసీ కాలేజీని మంజూరుచేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. అలాగే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. అధికారంలోకి రాగానే బోధన్ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ది నిధులు ఇవ్వాలని సీఎంకు విన్నవించారు.
ఆశీర్వాద సభలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రైతు నాయకుడు కోటపాటి నరసింహ నాయుడు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌రావు, మహారాష్ట్ర బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం, నాయకుడు శంకరన్న దోంగ్లే, ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్, బోధన్ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరావు దేశాయ్, ఎంపీపీ బుద్దె సావిత్రీరాజేశ్వర్, జాగృతి నాయకుడు అవంతిరావు, బీఆర్ఎస్ నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, రవీందర్ యాదవ్, గోగినేని నరేంద్రబాబు, సంజీవ్‌కుమార్, డి.శ్రీరామ్, భూంరెడ్డి, నర్సింగ్‌రావు, సాలూరా షకీల్, బుద్దె రాజేశ్వర్, రజాక్, మహమూద్, అబ్దుల్ వాసే తదితరులు పాల్గొన్నారు.