లింగంపేట్ : మండలంలోని పోతాయిపల్లి గ్రామంలో సోమవారం బోనాలను వైభవంగా ఊరేగించారు (Bonala procession ) . గ్రామంలో నిర్మించిన పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు . ఉదయం పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణం నిర్వహించగా , సాయంత్రం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు .
గ్రామంలోని ముదిరాజులు ప్రతి ఇంటి నుంచి అందంగా అలంకరించిన బోనాలను, డప్పు వాయిద్యాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించి పెద్దమాలయంలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు . కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నిర్వహించిన కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు.