బాన్సువాడ టౌన్, జూలై 11 : మన రాష్ట్రంలో నిర్వహించే బోనాలు, జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని 15 వార్డులో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బోనాల పండుగలో సతీమణి పుష్పమ్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులతో కలిసి సభాపతి దంపతులు బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించారు.
యువతులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. కార్యక్రమంలో బాన్సువాడ పురపాలక సంఘం చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు పిట్ల శ్రీధర్, వాంకార్ రమేశ్, సంఘం పెద్దలు పాల్గొన్నారు.