బాల్కొండ : బాల్కొండ నియోజకవర్గంలోని శ్రీరాంసాగర్ (Sriram Sagar) వరద కాలువలో పడి ఆదివారం గల్లంతైన వ్యక్తి మృతదేహం (Dead Body) లభ్యమైంది. చత్తీస్‌గఢ్‌కు చెందిన వీర్ సింగ్ బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామంలో మేస్త్రిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సెలువు దినం కావడంతో సెల్‌ఫోన్ రిపేర్ కోసం వెళ్లి వరద కాలువ గుండా తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో జారీ పడి గల్లంతయ్యాడు. సోమవారం అతడి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. మృతుడి సోదరుడు బిద్ మాన్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఠాకూర్ సింగ్ వెల్లడించారు.