Nizamabad | లింగంపేట్, మార్చి 4 : లింగంపేట్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ నాయకులు మంగళవారం సాయంత్రం సంబరాలు నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి మెజారిటీతో దూసుకుపోతున్నందున ఆ పార్టీ నాయకులు ముందస్తుగా టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలోను బిజెపి పార్టీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
పట్టభద్రుల ఎన్నికల్లోనూ బిజెపి అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని వారు వెల్లడించారు. దేశ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశంలో ప్రగతి పరుగులు తీస్తుందన్నారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొల్లారం క్రాంతి కుమార్, పార్టీ నాయకులు వెంకటేశం, పెద్ద శివయ్య, మురళి, శ్రీనివాస్, శ్రీకాంత్, నరేష్, ఉదయ్, పోశెట్టి ఎల్లేశం, సంతోష్‌తో పాటు బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.