Nizamabad | కంఠేశ్వర్, మే 24 : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం బర్తిపూర్ గ్రామంలోని సీఎస్ఐ చర్చి 11వ వార్షికోత్సవ వేడుకలను పెస్బిటర్ ఇంచార్జీ మెదక్ అధ్యక్ష మండల ఎక్యు మెనికల్ సెక్రెటరీ రెవ దినోకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీడీసీసీ చైర్మన్ నిజామాబాద్ రెవ సీహెచ్ జారీ మాట్లాడారు. ఈ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా చర్చిలో కేక్, స్వీట్లు పంచారు. ప్రార్థన అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కే భాస్కర్, నడిపల్లి ప్రెస్బీటరీ ఇన్చార్జ్ రెవ ఎం స్టీవెన్ కుమార్, బాడ్సి సీఎస్ఐ రెవ బీ ప్రవీణ్, కమిటి సభ్యులు ఏ పద్మారావు, ఏ పౌలు, ఎస్ పద్మారావు, ఎన్ దేవరాజ్, ఎం ప్రకాశం, ఎన్ జాన్ బాబు, మహేంధీర్, సురేష్, శోభమ్మా, కృవ, ప్రతిమ, రుచిత తదితరులు పాల్గొన్నారు.