మాక్లూర్, జూన్ 9: మండల కేంద్రంలోని శ్రీపాండురంగ విఠలేశ్వరస్వామి ఆలయంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు. అనంతరం గ్రామస్తులతో బిగాల సమావేశమయ్యా రు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం గురించి గ్రామస్తులు అడిగి తెలుసుకున్నారు.
భగవంతుని దయతో తమ కుటుంబానికి పెను ప్రమాదం తప్పిందని, ప్రమాదం జరిగిన తీరును గ్రామస్తులకు బిగాల వివరించారు. సర్పంచ్ వెంకటేశ్వర్రావు, మాజీ సర్పంచ్ రాజేందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రమణారావు, వీడీసీ అద్యక్షుడు నర్సయ్య, విండో డైరెక్టర్ కాశీనాథ్‌రావు, బిగాల విఠల్, రాజ్‌మల్లయ్య, దేవన్న, లక్ష్మీనారాయణ, నరేందర్, నర్సయ్య, రవి తదితరులున్నారు.