బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల మున్నూరు కాపు ( Munnur Kapu Sangam) మహిళా, రైతు, యువజన విభాగాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్నూరు సంఘం విభాగపు మహిళా మండల అధ్యక్షురాలుగా వాజిద్ నగర్ గ్రామానికి చెందిన తోట అనుసూయ( Anasuya ) , మండల యూత్ అధ్యక్షునిగా శెట్టిపల్లి విష్ణు ( Vishnu) ను, మున్నూరు కాపు మండల రైతు అధ్యక్షులుగా ధర్పల్లి అశోక్ ( Ashok ) ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా తోట అనుసూయ మాట్లాడుతూ మహిళలు అక్షరాస్యత కలిగి స్వశక్తితో ఎదిగి అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అన్నారు. కాలానుగుణంగా మహిళలు ఉన్నత చదువులు చదివి, శక్తివంతులై అన్ని రంగాల్లో రాణించాలన్నారు . స్వీయ రక్షణ కొరకు తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడవాలన్నారు.
మండల యూత్ అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు మాట్లాడుతూ మహిళా దినోత్సవం మున్నూరు కాపు మహిళా సంఘం అధ్యక్షురాలని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మున్నూరు కాపు యూత్ అధ్యక్షులుగా నాపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు మున్నూరు కాపులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో బిచ్కుంద మండలం మున్నూరు కాపు అధ్యక్షులు ధర్పల్లి సంతోష్, టౌన్ అధ్యక్షులు సాయిని అశోక్, మున్నూరు కాపు గౌరవ అధ్యక్షులు నాల్చారు రాజు, నాగనాథ్, సోపన్ సార్, గడ్డం అరవింద్, దర్పల్ గంగాధర్, పోతుల్ లింగురం, లక్ష్మీనారాయణ, హాజి లక్ష్మన్, తదితరులు పాల్గొన్నారు.