వినాయక్ నగర్ : భీమా కోరేగావ్ (Bhima Koregaon Case) అమరులకు నివాళిగా నిర్వహించిన ర్యాలీ కేసును నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఖుష్భు ఉపాధ్యాయ్ ( Magistrate Khushbhu ) గురువారం కొట్టివేశారు. మహారాష్ట్రలోని (Maharastra) భీమా కోరేగావ్ అమరుల దినోత్సవం సందర్భంగా 2018, జనవరి1 న నిజామాబాద్ నగరంలో కొన్ని దళిత సంఘాలు (Dalit Unions) ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాయి.
ర్యాలీకి పోలీసుల అనుమతి లేదని, చట్ట నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించారని, ర్యాలీని అడ్డుకోబోయిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు న్యాయ విచారణలో నేర నిరూపణ కాకపోవడంతో ప్రధాన ముద్దాయి చక్రే దౌలత్, దండి వెంకట్, రామారావు కాంబ్లే, సంజీవ్ ససనే, మధు కాంబ్లే, నవీన్ గాన్ద్రే, సబ్బని లత ను నిర్దోషులుగా విడుదల చేస్తు తీర్పు వినిపించారు.