Kotagiri | కోటగిరి, జనవరి 27 : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ( రోగులకు) అందుబాటులో ఉండి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డాక్టర్ రాజశ్రీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మందుల స్టాక్ నిల్వ లను పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, డాక్టర్ సుప్రియను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో భర్తీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతీ మహిళ ఆరోగ్యం కోసం ప్రతీ మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డాక్టర్లు నర్సులు అందుబాటు లో ఉండి నాణ్యమైన వైద్య సేవాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్ సుప్రియ, సిబ్బంది పాల్గొన్నారు.