నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 27: డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్ తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఏడేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామంలో 157 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించింది.
అధికారులు అర్హులను ఎంపిక చేసి ఇండ్లను పంపిణీ చేయగా.. లబ్ధిదారులు సంతోషంగా గృహప్రవేశాలు చేసుకున్నారు. అయితే ఇండ్లకు సంబంధించిన పట్టాల కోసం 157 మంది లబ్ధిదారులు బీర్కూర్ తహసీల్ కార్యాలయానికి తరలివచ్చారు. వెంటనే పట్టాలని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ లతకు వినతిపత్రాన్ని అందజేశారు.