శక్కర్‌నగర్, ఆగస్టు 5: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎంఎల్ మాస్‌లైన్(ప్రజాపంథా) ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. బోధన్, నందిపేట, కమ్మర్పల్లి మండల కేంద్రాల్లోని ఆర్డీవో, తహసీల్ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత స్థలాలు ఉన్న వారికి ఇండ్ల నిర్మాణానికి రూ.6లక్షలు, గృహలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఇస్తామని హామీనిచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించాలన్నారు.