బాన్సువాడ: బీర్కూరు మండలంలోని చించెల్లి గ్రామంలో శుక్రవారం బారెడి పోచమ్మ (Baradi Pochamma) పండుగను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా మహిళలు ఇంటింటా బోనాలతో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో పాడిపంటలు పుష్కలంగా పండాలని, ప్రజలంతా ఆయురార్యోగంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు . అనంతరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో శ్యాంసుందర్, అశోక్, గ్రామ యువకులు, మహిళలు పాల్గొన్నారు.