వినాయక నగర్ : సీనియర్ న్యాయవాది ఎల్లయ్య ( Senior Advocater Yellaiah )మృతికి నిజామాబాద్ బార్ అసోసియేషన్ (Bar association) గురువారం సంతాపం (Mourns) ప్రకటించింది. బోధన్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది కంటే ఎల్లయ్య మృతి బాధాకరమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ (Jagan Mohan goud) అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్ లో నిర్వహించిన సంతాప సమావేశంలో ఆయన మాట్లాడారు.
బోధన్ ప్రాంత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పూర్వ కార్యకర్తగా, బోధన్ శిశుమందిర్ పాఠశాల ప్రబంధకారునిగా ఎనలేని సేవలు అందించి సమాజోద్ధరణకు కృషి చేశారని వెల్లడించారు. జ్యుడిషియల్ ఉద్యోగిగా న్యాయవాదులు, న్యాయ సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండేవారని పేర్కొన్నారు.
న్యాయవాదిగా న్యాయసేవలు అందించారని వివరించారు. న్యాయవాది మృతి పట్ల సంతాప సూచకంగా న్యాయవాదులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి, బార్ ఉపాధ్యక్షుడు రాజు, కార్యదర్శి దొన్పల్ సురేష్, కోశాధికారి దీపక్ తదితరులు పాల్గొన్నారు.