బాల్కొండ : ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం, వారిలో మార్పుకోసం ఏర్పాటు చేసిన భవిత విద్యావనరుల కేంద్రం సేవలను చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగపర్చుకోవాలని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఒక ప్రకటనలో కోరారు. బాల్కొండ భవిత విద్యావనరుల కేంద్రం సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.
భవిత కేంద్రంలో ఫిజియోథెరపిస్టు, ఉపాధ్యాయులు అందిస్తున్న శిక్షణ ద్వారా చిన్నారుల్లో గుణాత్మక మార్పులు వస్తాయన్నారు. ప్రతిరోజు ఇంటి వద్ద కూడా చిన్నారులతో తల్లిదండ్రులు వ్యాయామం చేయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ ఇందిర, ఐఈఆర్టీ రాజ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.