Nizamabad | కోటగిరి, జూలై 6 : భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాం అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచి రాం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోచిరాం మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ప్రతీ ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు, కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, ఆనంద్, హస్కుల శ్రీకాంత్, కన్నం శ్రీనివాస్, రవి, నర్సింలు సాయిలు, చందర్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.