బీబీపేట్, ఫిబ్రవరి 26: మండల కేంద్రానికి చెందిన బచ్చు హరిప్రియ ఉక్రెయిలోని కర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మూడో సంవత్సరం చదువుతున్నది. యుద్ధం నెలకొన్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె తన తల్లిదండ్రులకు ద్వారా తెలిపింది. నిత్యావసర వస్తువులు కూడా దొరకడం లేదని, మెట్రో అండర్ బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నామంటూ వాపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన తండ్రి బచ్చు చంద్రశేఖర్‌కు పంపించింది. కర్కివ్ సిటీ నుంచి హర్మినియో సిటీకి లేదా పోలాండ్‌కు వెళ్లడానికి 1600 కిలో మీటర్ల దూరం ఉందని, దీంతో భారత్‌కు తీసుకరావడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారని తండ్రి చంద్రశేఖర్ తెలిపారు. భారత ఎంబసీ వారు స్పందించి తన కూతురిని స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు.