నవీపేట, డిసెంబర్ 28: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యంచ గోదావరి నదిలో ఆదివారం ఓ నవజాత శిశువు మృతదేహం స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై యాదగిరి గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
శిశువు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంతానం లేక ఎంతో మంది బాధ పడుతున్న ప్రస్తుత రోజుల్లో ఓ తల్లి అతి కర్కశంగా ఇలా చేయడం స్థానికులను కలిచివేసింది.