మోర్తాడ్, అక్టోబర్ 29: ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో మంగళవారం మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతిఏటా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి, అక్టోబర్ 29న మూసివేయాలి. ఇందులోభాగంగా ప్రాజెక్టు 14 గేట్లను మూసివేశారు. కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్రావుగుప్తా, సీఆర్ బన్సోడ్ ఈఈ నాందేడ్, ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి, డీఈఈ గణేశ్, ఏఈఈ రవి, ఎస్డీఈ (సీడబ్ల్యూసీ) సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
బాబ్లీ గేట్లు మూసివేయడంతో ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో తగ్గింది. మంగళవారం ప్రాజెక్ట్‌లోకి 9,454 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(80.5టీఎంసీలు) కాగా, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1091అడుగుల(80.501టీఎంసీలు)నీటి నిల్వ ఉంది. కాకతీయ కాలువకు నాలుగువేలు, లక్ష్మీకాలువకు 150, మిషన్‌భగీరథకు 231, వరదకాలువకు నాలుగువేలు, సరస్వతీ కాలువకు 500క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.