Kamareddy | కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప ఆలయ 36వ మండల పూజ కుంబాభిషేకం బుధవారం ముగిసాయి. ఈ సందర్భంగా కేరళ సహాయ అర్చకులు నంబూద్రి, వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ, ఆలయ అర్చకులు కన్నయ్య ఆధ్వర్యంలో గణపతి హోమం, కలశాభిషేకం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదబిన వోదండ విద్యా శంకర భారతి హాజరై పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేశారు.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు నస్కంటి శ్రీనివాస్, కార్యనిర్వహణ అధ్యక్షుడు పట్నం రమేష్, కార్యదర్శి గోనే శ్రీనివాస్, అయ్యప్ప అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు రాజేందర్, కుంభాల రవి యాదవ్, అయ్యప్ప స్వాములు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.