ఆర్మూర్/ భీమ్‌గల్/ బాల్కొండ/ బోధన్ రూరల్/ మోర్తాడ్/ రెంజల్/ నవీపేట, జనవరి13: ఈనెల 18 నుంచి నిర్వహించ తలపెట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితా పవన్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కంటి వెలుగుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నూబాయి, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మనోహర్, కౌన్సిలర్లు, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
భీమ్‌గల్ మున్సిపల్ సమావేశ మందిరంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కన్నే ప్రేమలత, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్, వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
భీమ్‌గల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆర్మూర్ మహేశ్ అధ్యక్షతన అవగాహన కల్పించారు. జడ్పీటీసీ చౌట్పల్లి రవి, ఎంపీడీవో ఎల్.రాజేశ్వర్, తహసీల్దార్, ఎంపీవో గంగామోహన్, ఏపీఎం శ్రీనివాస్, ఏపీవో నర్సయ్య, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి స్వర్ణలత పాల్గొన్నారు.బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లావణ్యా లింగాగౌడ్ అధ్యక్షతన ఎంపీడీవో సంతోష్‌కుమార్, వైద్యులు పవన్‌కుమార్, కృష్ణ ఆధ్వర్యంలో కంటి వెలుగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత, ఏపీఎం గంగాధర్, కిసాన్‌నగర్ ఎంపీటీసీ రామరాజుగౌడ్, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్ పాల్గొన్నారు.
బోధన్ మండలం పెగడాపల్లిలో ఈ నెల 18న నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్ గుండారం శంకర్, బోధన్ ఎంపీడీవో మధుకర్తోకలిసి కంటి వెలుగు శిబిరం నిర్వహించే పంచాయతీ భవనాన్ని శుక్రవారం పరిశీలించారు. అంతకు ముందు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు.
మోర్తాడ్‌లో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ బోగధరణి, ఎంపీటీసీ రాజ్‌పాల్ పాల్గొన్నారు. రెంజల్లో ఎంపీపీ లోలపు రజిని కంటి వెలుగు కర పత్రాలను ఆవిష్కరించారు. ఎంపీడీవో శంకర్, నీలా సర్పంచ్ గౌరాజీ లలిత రాఘవేందర్, వైస్ ఎంపీపీ యోగేశ్, మండల వైద్యాధికారి వినయ్‌కుమార్, ఏపీఎం చిన్నయ్య, ఎంపీవో గౌసొద్దీన్ పాల్గొన్నారు.
నవీపేటలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్ మాట్లాడారు. 32 గ్రామ పంచాయతీల్లో 45 రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీ, ఎంపీవో రామకృష్ణ, ఎంపీటీసీ మీనా, నవీన్‌రాజ్, ఏపీఎం భూమేశ్వర్గౌడ్, బినోలా వైద్యాధికారి సామ్రాట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.