ఆర్మూర్, ఫిబ్రవరి 8 : ఆర్మూర్ మున్సిపల్ వైస్‌చైర్మన్ షేక్ మున్నాపై సత్తార్ అనే మైనారిటీ నాయకు డు మంగళవారం దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజల కోరిక మేరకు డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు వైస్‌చైర్మన్ మున్నా మంగళవారం ఉదయం పెర్కిట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సత్తార్ వైస్‌చైర్మన్‌ను అడ్డుకుని అసభ్య పదజాలంతో దూషిం చాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసు కున్నది. ఈ క్రమంలో మున్నాపై సత్తార్ దాడి చేశా డు. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను ఆనుకొని ఉన్న కోకాలను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో తొలగించారు. అప్పు డు కూడా సత్తార్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తార్‌పై అప్పుడు కేసు కూడా నమోదు చేశారు. దాడి విషయం తెలుసు కున్న పాలకవర్గ సభ్యులు, నాయకులు ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సత్తార్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడ్డ షేక్ మున్నాను పోలీసులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గొడవ జరిగిన ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా ఎస్సైలు యాదగిరిగౌడ్, శ్రీకాంత్ ఇరువర్గాలను సముదాయించి శాంతింపజేశారు. షేక్ మున్నాను టీఆర్ఎస్ నాయకులు ప్రేమ్, నరేందర్, సయ్యద్ ఫయాజ్, రహమాన్, అతీక్ పరామర్శించారు.