నిజామాబాద్: ఏటీఎంలో నింపాల్సిన నగదుతో సెక్యూటీ ఏజెన్సీ ఉద్యోగి పరారయిన ఘటన నిజామాబాద్లో (Nizamabad) చోటుచేసుకున్నది. నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న ఓ ఏజెన్సీలో రమాకాంత్ అనే ఉద్యోగి గత ఐదేండ్లుగా పనిచేస్తున్నాడు. ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో లోడ్ చేసేందుకు రూ.40.50 లక్షలను తీసుకెళ్తున్నారు. అయితే నగదు తీసుకెళ్లే వాహనం ఆలస్యమైంది. దీంతో ఆ మొత్తాన్ని తీసుకుని రమాకాంత్ పరారయ్యాడు. గుర్తించిన సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.