సిరికొండ: జాతీయస్థాయి రగ్బీ (Rugby) పోటీలకు ఆశ్రమ పాఠశాల విద్యార్థి చిన్న ఎంపికైనట్లు పిజికల్ డైరెక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఈనెల 2నుంచి 4 వ తేదీ వరకు మంచిర్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి (State Level) రగ్బీ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి ( National Level ) క్రీడలకు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన విద్యార్థి చిన్నను సోమవారం పాఠశాలలో ప్రిన్సిపల్ భోజనం శాలువతో సన్మానించి అభినందించారు. జాతీయ స్థాయిలోనూ అత్యుత్మ ప్రతిభను కనబరిచి పాఠశాల ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.