కామారెడ్డి,జూన్ 15: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఆశిష్ సంగ్వాన్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న జితేశ్ వీ పాటిల్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆశిష్ సంగ్వాన్ స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని భివాని. అమెరికాలోని జార్జి యా టెక్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసిన అనంతరం 2015లో జరిగిన సర్వీసెస్ పరీక్షలో 12వ ర్యాంకు సాధించారు. 2023 అక్టోబర్ నుంచి నిర్మల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సంగ్వాన్‌ను కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నియమించారు. ఆయన భార్య కూడా 2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ క్రాంతి వల్లూరు. ప్రస్తుతం ఈమె సంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.