సిరికొండ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence ) విద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఎంఈవో రాములు ( MEO Ramulu ) అన్నారు. శనివారం మండలంలోని రావుట్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యను విద్యార్థులకు సులభంగా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా, వారే సొంతంగా మూల్యాంకనం చేసుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. పాఠశాల ప్రధానో పాధ్యాయులు విజేత మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వము నుంచి రావడం చాలా సంతోషకరమని, పేద పిల్లలకు ఏఐ పాఠాలు చెప్పడం శుభ పరిణామని పేర్కొన్నారు.
అనంతరం ఎంఈవో జడ్పీహెచ్ఎస్లో పదవ తరగతి (SSC Exams, ) ప్రత్యేక తరగతులు పరిశీలించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని, సమయాన్ని వృధా చేయకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ , జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, యం బాలయ్య పాల్గొన్నారు.