బాలుడి దారుణ హత్య
: కామారెడ్డి పట్టణంలో దారుణం చోటుచేసుకున్నది. సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని ఐదేండ్ల బాలుడిని అతి కిరాతకంగా హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట గ్రామానికి చెందిన లక్ష్మికి ఆర్గొండ గ్రామానికి చెందిన భాస్కర్‌తో 2014లో వివాహమైంది.
- సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని హతమార్చిన కిరాతకుడు
- ఇద్దరు నిందితుల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
- కామారెడ్డి పట్టణంలో ఘటన
కామారెడ్డి, ఏప్రిల్ 18 : కామారెడ్డి పట్టణంలో దారుణం చోటుచేసుకున్నది. సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని ఐదేండ్ల బాలుడిని అతి కిరాతకంగా హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట గ్రామానికి చెందిన లక్ష్మికి ఆర్గొండ గ్రామానికి చెందిన భాస్కర్‌తో 2014లో వివాహమైంది. వీరికి కూతరు సమీరా(8), కుమారుడు శ్రావణ్ (5) ఉన్నారు. కుటుంబంలో కలహాలు రావడంతో లక్ష్మి తన భర్తకు దూరంగా పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నది. ఆరు నెలలుగా లక్ష్మీనర్సింహులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి సహజీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో తమకు పిల్లలు అడ్డు వస్తున్నారనే ఉద్దేశంతో శుక్రవారం లక్ష్మి పని మీద బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న కుమారుడు శ్రావణ్‌ను లక్ష్మీనర్సింహులు గొంతు పిసికి, నోరు, ముక్కు మూసి నేలకేసి కొట్టి కండ్లల్లో కారంపొడి పోసి దారుణంగా హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. లక్ష్మి బాబాయ్ రమేశ్ ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేశామని సీఐ తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితులు లక్ష్మి, లక్ష్మీ నర్సింహులు ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. తమకు కుమారుడు అడ్డువస్తున్నాడనే కారణంతో ఇద్దరు కలిసి పథకం ప్రకారం హత్యచేసినట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

